Swamiji Lived House
The residence of the Swamji is located in Kandimallayalpalle Village, at about a furlong distance from Jagathguru Sri Madvirat Pothuluri Veerabrahmendra Swamy Mattam, on the Southern side. It is here that Sri Swamiji, living with his wife, making agricultural implements for the villagers and preaching the philosophy left by his fathers and forefathers, to the people. On the pretext that he criticized the sacrificing of innocent animals with ill conceived, superstitious practices, the villagers have driven him away from the village. There is a popular belief that Sri Swamiji, then, dug out a well for himself in his backyard. The water in this well is very cool. On the eastern side of this house, there is a Pooja Mandir. Right from his time, a Paamulaputta (a small heap like earth where snakes live) that has been growing up steadily since his time. In the year 1912 on the auspiious day of Karthika Bahula Trayodasi, a Soujanya Patrika a Palmyra leaf (Taalapatram) had emerged and was preserved.
శ్రీ స్వాములవారు నివసించిన గృహము
కందిమల్లాయపల్లెలోని జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు దక్షిణ దిక్కున సుమారు పర్లాంగు దూరములో శ్రీ స్వాములవారి నివాస గృహము ఉన్నది. ఇక్కడే శ్రీ స్వాములవారు తన భార్య గోవిందమాంబతో కలసి సంసారముచేస్తూ, ఆ గ్రామప్రజలకు వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తూ, తత్త్వభోధన చేశారు. మూడ నమ్మకాలను, జంతుబలులను నిరసించినందులకు గాను ఆ గ్రామస్థులు, శ్రీ స్వాములవారిని గ్రామ భహిష్కరణ చేయగా స్వంతంగా తన గృహములో బావిని త్రవ్వుకున్నాడని ప్రతీతి. ఈ బావిలోని నీళ్లు అతి చల్లగా ఉంటాయి. ఈ గృహమున తూర్పు భాగమున పూజా మందిరము ఉంది. ఈ మందిరములో శ్రీ స్వాములవారి కాలము నుండి పాముల పుట్ట పెరుగుతున్నది. 1912 సంవత్సరమున కార్తీక బహుళ త్రయోదశి నాడు ఆ పాముల పుట్ట నుండి సౌజన్య పత్రిక (తాళ పత్రము) దొరికినది.
श्री वीरब्रह्मेंद्रस्वामीजी कंदिमल्लय पल्ले में निवासस्थान
कंदिमल्लयपल्ले में श्री वीरब्रह्मेंद्रस्वामीजी का निवासस्थान दक्षिण में, मठ से लगभग एक फर्लांग दूरी पर है। यहीं पर श्री स्वामीजी ने अपनी पत्नी गोविंदमाम्बा के साथ गृहस्थी का निर्वहन करते हुए, उन ग्रामस्थों लिए कृषि उपकरण बनाए और उन्हें दर्शनशास्त्र से अवगत कराया। अंधविश्वासी प्रथाओं के साथ निर्दोष पशुओं की बलि की उन्होंने आलोचना की, इसलिए ग्रामीणों ने उन्हें गांव से बहिष्कृत किया। एक प्रचलित धारणा है कि श्री स्वामीजी ने तब स्वयं अपने घर के पिछवाड़े में एक कुआं खुदवाया था। उस कुएं का पानी बहुत ठंडा है। घर के पूर्व दिशा में एक पूजा मंदिर है। इस मंदिर में श्री स्वामीजी के समय से ही सांपों का एक बिल वृद्धिंगत होते जा रहा है। वर्ष 1912 में कार्तिक बहुला त्रयोदशी के दिन पर सांप के बिल से एक शिष्टाचार पत्रक (तालपत्र) मिला था।
-
Events in Brahmamgari Mattam-
శ్రీ విశ్వావసు నామ సంవత్సర మాఘ బహుళ తయోదశి తేది 14-02-2026 శనివారం నుండి పాల్గుణ శుద్ధ విదియ తేది 18-02-2026 బుధవారం వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం నందు మహా శివరాత్రి మహోత్సవములు జరుగును.
జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంలో సా|| 5-00 గంటలకు శివ పార్వతుల కల్యాణము జరుగును.
తేది: 15-02-2026 ఆదివారం మహా శివరాత్రి పర్వదినం రోజున రాత్రి 8-00 గంటలకు శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాములవారి కల్యాణము జరుగును.
తేది 17-02-2026 మంగళవారం రోజున మధ్యాహ్నం 12-00 గంటలకు మహా ప్రసాద వినియోగముతో ఉత్సవాలు ముగుస్తాయి. -
శ్రీ విశ్వావసు నామ సం||ర పాల్గుణ శుద్ధ ద్వాదశి, తేది : 28-02-2026 శనివారము రోజున ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ విశ్వావసు నామ సం||ర పాల్గుణ బహుళ దశమి, తేది: 13-03-2026 శుక్రవారము రోజున కందిమల్లాయపల్లెలో శ్రీ మాతా గోవిందమాంబ మహాదేవివారి ఆరాధన మహోత్సవము జరుగును.
-
శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి తేది : 19-03-2026 గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంలో "తెలుగు సంవత్సరాది ఉగాది" రోజున ఉదయం విశేష పూజలు, సాయంత్రం 5-00 గంటలకు పంచాంగ శ్రవణం జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర చైత్ర శుద్ధ ద్వాదశి, తేది: 29-03-2026 ఆదివారము రోజున ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర వైశాఖ శుద్ధ సప్తమి, తేది: 23-04-2026 గురువారం నుండి వైశాఖ శు|| ద్వాదశి తేది: 28-04-2026 మంగళవారం వరకు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి ఆరాధన గురుపూజా మహోత్సవములు జరుగును.
-
తేది: 26-04-2026 ఆదివారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 333వ ఆరాధన గురుపూజా మహోత్సవము.
తేది: 27-04-2026 సోమవారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి బ్రహ్మ రథోత్సవం.
తేది: 28-04-2026 మంగళవారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మహా ప్రసాద వినియోగము. -
తేది: 29-04-2026 బుదవారం రోజున కందిమల్లాయపల్లెలో తూర్పు దిక్కున వేంచేసియున్న శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవము, రథోత్సవం జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర అధిక జేష్ఠ శుద్ధ ద్వాదశి తేది: 27-05-2026, బుధవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర నిజ జేష్ఠ శుద్ధ ద్వాదశి తేది: 26-06-2026, శుక్రవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర ఆషాడ శుద్ధ పూర్ణిమ తేది: 29-07-2026, బుధవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంలో శిష్యప్రశిష్యులచే గురుపూజా మహోత్సవములు జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర శ్రావణ శుద్ధ పంచమి తేది: 17-08-2026 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి మనుమరాలు జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి 323వ జయంతి మహోత్సవములు
-
శ్రీ పరాభవ నామ సం||ర శ్రావణ ద్వాదశి తేది: 24-08-2026, శుక్రవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర భాద్రపద శుద్ధ ద్వాదశి తేది: 23-09-2026, బుధవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి తేది: 11-10-2026 ఆదివారం నుండి ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి తేది: 21-10-2026 బుధవారం వరకు జరుగును.
తేది: 17-10-2026 శనివారం మూలా నక్షత్రం – కలశోత్సవము, విశేష పూజలు
తేది: 20-10-2026 మంగళవారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం నందు విజయ దశమి, శమి పూజా మహోత్సవము జరుగును.
తేది: 21-10-2026 బుధవారం మహా ప్రసాద వినియోగముతో ఉత్సవాలు ముగుస్తాయి. -
శ్రీ పరాభవ నామ సం||ర కార్తీక శుద్ధ ఏకాదశి తేది: 20-11-2026, శుక్రవారము నుండి కార్తీక శుద్ధ త్రయోదశి తేది: 22-11-2026, ఆదివారము వరకు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి 418వ జయంతి మహోత్సవములు జరుగును.
తేది: 21-11-2026 శనివారము కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారు అవతరించిన పవిత్ర సుదినము. ఉదయం విశేష కలశోత్సవ అభిషేకములు, రాత్రి 7-30 ని||లకు విశ్వశాంతి లోక కళ్యాణ మహోత్సవము జరుగును. -
శ్రీ పరాభవ నామ సం||ర మార్గశిర శుద్ధ ఏకాదశి తేది: 20-12-2026 ఆదివారము ముక్కోటి ఏకాదశి పర్వదినం. కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారు శేష వాహనంపై విష్ణుమూర్తి అవతారంలో భక్తులకు ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు.
-
శ్రీ పరాభవ నామ సం||ర మార్గశిర శుద్ధ ద్వాదశి తేది: 21-12-2026, సోమవారం ఉదయం 9-00 గంటలకు కందిమల్లాయపల్లెలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాములవారి మాస కల్యాణము జరుగును.
-
శ్రీ పరాభవ నామ సం||ర మార్గశిర బహుళ నవమి తేది: 31-12-2026 గురువారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మనుమరాలు జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి అమ్మవారి 237వ ఆరాధన మహోత్సవములు జరుగును.
-
