Brahma Sagar
During the year 1982 late Sri Nandamuri Taraka Rama Rao made a film on the life history of Sri Veerabrahmendra Swami. Later, he became the Chief Minister of the State. As a mark of devotion and belief on Swami, he laid the foundation-stone for ‘Telugu Ganga’ Project which cannot be forgotten by the people of these areas, on 24th April 1984 by joining hands with the Chief Minister of Tamilnadu. Since a reservoir has been built near the Mattam of Sri Veerabrahendra Swami, it is named as “Brahma Sagar” In 2004 when Sri Dr. Y.S. Raja sekhara Reddy was the Chief Minister of Andhra Padesh, water from Pothireddipadu to the Brahma Sagar was released. The water has been released into the canals through the hands of Smt.Sonia Gandhiji from the Brahma Sagar. Gardens have been built by the Tourism Department. With its cool atmosphere and the beauty of the nature, The Telugu Ganga (Brahma Sagar Project) attracts tourists. A majority of tourists and pilgrims, who come to visit the Mattam of Sri Veerabrahmendra Swami visit this beautiful spot without fail.
బ్రహ్మసాగర్
1982 సంవత్సరములో శ్రీ నందమూరి తారక రామారావుగారు "శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి జీవిత చరిత్ర"పై సినిమా తీశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీ స్వాములవారిపై భక్తి, విశ్వసాలకు ప్రతీకగా ఈ ప్రాంతవాసులు కలకాలం మరిచిపోని విధంగా "తెలుగు గంగ" ప్రాజెక్టును నిర్మించుటకు 1984 ఏప్రిల్ 24వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్ తో కలసి శంకుస్థాపన చేశారు.శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం సమీపములో రిజర్వాయర్ నిర్మించినందువలన “బ్రహ్మసాగర్” అని నామకరణం చేశారు. 2004 సంవత్సరములో డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మసాగరుకు పోతిరెడ్డిపాడు నుండి నీటిని వదిలారు. శ్రీమతి సోనియాగాందిగారి చేతులమీదుగా బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుండి నీటిని కాల్వలకు విడుదల చేయించారు. పర్యాటకశాఖవారు ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. తెలుగుగంగ (బ్రహ్మసాగర్ ప్రాజెక్టు) చల్లని వాతావరణం, ప్రకృతి రమణీయతతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారిని దర్శించుకున్న భక్తులు, యాత్రికులు అధిక భాగం బ్రహ్మసాగరును తిలకిస్తారు.
ब्रह्मसागर जलाशय, कंदिमल्लय पल्ले
वर्ष 1982 में, श्री नंदमुरी तारक रामा रावजी ने श्री वीरब्रह्मेंद्रस्वामी की जीवनी पर एक फिल्म बनाई। उसके उपरांत वे राज्य के मुख्यमंत्री बने। 24 अप्रैल, 1984 को, उन्होंने तमिलनाडु के मुख्यमंत्री एमजी रामचंद्रन के साथ मिलकर "तेलुगुगंगा" परियोजना के निर्माण के लिए आधारशिला रखी, जो श्री स्वामीजी में भक्ति और विश्वास का प्रतीक है। श्री वीरब्रह्मेंद्रस्वामीजी के मठ के पास एक जलाशय के निर्माण के कारण इसका नाम "ब्रह्मसागर" रखा गया।
वर्ष 2004 में डॉ. वाईएस जब राजशेखर रेड्डी मुख्यमंत्री थे, तब पोतिरेड्डीपाड़ा से ब्रह्मसागर तक पानी छोड़ा था। श्रीमती सोनिया गांधी के हाथों ब्रह्मसागर जलाशय से नहरों में पानी छोड़ा गया। पर्यटन विभाग द्वारा उद्यान वनों को स्थापित किए गए हैं। तेलुगुगंगा (ब्रह्मसागर परियोजना) अपने शीतल वातावरण और प्राकृतिक सुंदरता से पर्यटकों को आकर्षित करती है। श्री वीरब्रह्मेंद्रस्वामी के दर्शन करने वाले अधिकांश भक्त और तीर्थयात्री ब्रह्मसागर अवश्य जाते हैं।
