
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము
-
భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము
(శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)
(1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)
అని అంటిని కాబోలు శ్రీ వేద వేద్య విష్ణునిరంజన పూజమీద విరాట్ యనగానే వటపత్రిశయనుడు అనగానె వటము, మర్రివృక్షము, పత్రము అనగానే ఆకు, శయనుండు అనగానే శ్రీ మహావిష్ణువు ఆయననే ఆదినారాయణమూర్తి యనగానె శ్రీ మహావిష్ణువు శ్రీ వీరబ్రహ్మేంద్ర యోగీంద్రుండు వీర వీరత్వము చేతను, బ్రహ్మ బ్రహ్మత్వముచేతను దశావతారములు యెత్తి మరిన్నీ దేవతా సార్వభౌముండై నరదేవతా అవతారం బెత్తి ఆనందాశ్రమములకు శిష్యుడవై అంతర్భవిష్యమంతా సాంద్రసింధు వేదములు చదివి బనగానిపల్లె జేరి కార్తీక బ॥ ౩ (3)లు దినముల మీద దివ్యదేహము జేసినాము. పున్నమవరకు శుభ ముహూర్తము విచిత్రవీర్యుని పుత్రిని బట్టిస్తిమి. ఆత్మగర్భమున అర్థీమీద పంతము నోటిలో రంగా కవికి రూపంబు మహిమ కానక కనంగ లేరు. కటకటా యీ కాలమెల్ల కాన యాచిగానే నమ్మిపోయిరి. జనులు మహిని ఆదిత్యమే మహం మయం వేదాలకెల్ల సాంద్రసింధు వేదము, ఆదివేదము ఆంధాతు పరంధాతు అనేది వాక్యమే కారణము. పక్షం పక్షం మయం మయః, పక్షమనగా శుక్లపక్షము. మయం అంటేను మజిష్టయనే మాధవభట్లు. య అంటే యజ్ఞశాలలో యాగం జేసే దివసము. సర్వానకు పంచమే కారణము. పూర్వానకు పంచమే కారణము అని ఆనతిచ్చినాము. రామ ధర్మజులకు పంచమే కారణము. సర్వము నారాయణుని మాసము. చైత్రమాసమనే మరుగు, నారాయణ మాసమంటే చైత్రమాసము. కేశవమాసం అంటే వైశాఖమాసము. మాధవమాసము అంటే జ్యేష్టమాసము. చైత్రమాసము నారాయణుని మేనల్లునిది. ఇంద్రుని వాయిద్యము డోలు, నాగస్వరాలు ఆదివిష్ణువు వాయిద్యాలు సన్నవీణెలు. రామధర్మజుల బిరుదు. భేరి మూడుయోజనాలు నిడువున్ను యోజనము వెడల్పున్ను. భేది దేవతా మృగాలు గండభేరుండ మృగాలు. గండభేరుండ చర్మాలు సోకితే యిన్నూటయాభై యోజనాలు వినవచ్చును. ధవళాలు, అష్టకాలు ఆడెవాండ్లు కోటానుకోట్లు స్త్రీలు పురుషులు సర్వకాలం సామ్రాజ్య అద్భుతాలు, కాల్బగాలు, గుర్రములు, యేనుగులు, అనంతాలు, కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు వెంటనే వస్తున్నవి. ఇంద్రుని యేనుగు ఉచ్చైశ్రవము, రంభ మొదలగు నాట్యస్త్రీలు వెంటనే వస్తున్నారు. ఈ స్త్రీలు వక్క ముహూర్తాననే కట్టేము. ఈ ముహూర్తమనగా రెండు ఘడియలవరకు. ఉత్తరానకు మూడువేల మున్నూరు ఆమడయుండె నా చంగల్వకోట చంద్రలోకమట, తూర్పున మూడువేల మున్నూరు ఆమడయుండె నా వెలయపురి, దక్షిణం మూడువేల మున్నూరు ఆమడయుండే నా అన్నియిస్తిమి. నాన్యోదకన, గాయత్రి, ఆనందా శ్రమములచేత బ్రహ్మ బీజాక్షరాలు, మంత్రోపదేశమిస్తిమి. శాంతికరోమి శాంతిః ఈ తీరున మార్కండేయులతో సంకర్షణమూర్తి అనెను. ఇంకా శంకరుడు ఆనతిచ్చిన వాక్యము మార్కండేయునితో అన్నమాట వీరప్పయ్య వేదాద్రి గరుడాద్రి యందు తపస్సు చేయగ నేను పోయియుంటిని. నాకు అనేక పూజలు జేసి వుపచరించెను.
అందుచేత యాయన నాకన్న ఘనుండని అంటిని. నాన్యోదకన గాయత్రికి యీయనె అర్హుడని అంటిని. యీయనే వేదముద్దర ఇయనే వేద పురుషుండంటిని. ఏనుగులు, ఎనుములు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, యివి అన్ని పూర్ణితమై యుండీని, లొట్టిపిట్టలు, గార్దబాలు, శూకరములు, కుక్కలు, నక్కలు, పులులు, ఏనుగులు, చీమలు, దోమలు, నల్లులు, పేలు, పాములు, తేళ్లు యివి మొదలయినవి నాశనమై పొయ్యీని, వ్యాధులు కట్టుబోతులు, చాడీ కాండ్రు, కొండేలు, పిల్లి, యెలుక, కొక్కు, ముంగిసలు, నాశనమయ్యి పొయ్యిని, యిది ధర్మరాజు రాఘవుల యేలుబడి సామార్థ్యము సద్యోఘ్రుతము పాయసమె యంతి సకలమైనవారు మూడువేళల పాయసమే భోంచేసుకుంటూ యుండేరు. శాంతాకారమైన స్వామి రాజ్యం యేలె వివరం. ఇది యింకా వినేవార్తలు రేపు ఆనతిచ్చెము.
శ్లో॥ రామెరామె రమేయంతి మనోనాశ్రయః కేవళం ధన్యవా ధన్యమేయంతి
ఆదివంశ సముద్భవం పంచాంగం పఠితే నిత్యం
టీక: పంచమీకె పోతూయున్నది. సాంద్ర సింధు సమంవందె కల్పకోటి శతైరపి సద్యుక్త మధ్యమాత్మానో బ్రహ్మమేకోమయో మయః కోటిజన్మక్రుతం పాపం బ్రాహ్మణోదివ సాంత్యజిత్ ఆది భార్గనమే రాజ్యం భాద్రపదమాస పౌర్ణమీ సద్యుక్తమెల్లా తీరెను. ఇందు యిందుకులం వందె యీరేడు భువనత్రయం నందిగ్రామేతు విఖ్యాతు నందినాం సూర్యనందీనాం సోమాం సోమ మహీపాలో కేశవో పరితో జయంతు కౌస్యపగోత్రమే మయంతు రౌద్ర సప్తక మత్పరం కులపాదంచ కూర్మంచ కులమేకమయేమయః కులగోత్ర విశాలాక్షో కూర్మ సింహాసనాత్మకః.
భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము
తృతీయాశ్వాసము సంపూర్ణం.

