శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము

  • p style="text-align: center;">భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము

    (శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)

    (1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)

    అని పూజించి, బ్రాహ్మణ పూజజేసి బ్రాహ్మణోత్తముని, నా మర్యాదగా భావించి షడ్రశోపేతముగా అన్నంబుబెట్టి తృప్తిజేసినవారు, నాకు ప్రీతిజేసిన వారు, నాయంతవారు, వారే పరమపుణ్యులు, వారే పరమ భాగవతోత్తములు, వారు యిహపర సౌఖ్యంబులు కొల్లలాడుదురు. వారికి నేను వశవర్తినై యుందును. బైరవానందయోగి యీ మంత్రంబు ఋగ్వేద, యజుర్వేద, సామవేద. అధర్వణంబులకు సమానము, యీ మంత్రంబును ధూషణ, తిరస్కారంబులు జేసినవారు, నరకంబునబడి క్రిమిభక్షణంబులు జేయుదురు. అనంత బ్రహ్మకల్పాలు బడియుందురు. యీమంత్రంబు యవ్వరైనను భక్తిపూర్వకముగా పూజచేసినవారు, నమస్కారములు చేసినవారు, అనేక శివకల్పాలు నాతో జోడుగూడి చరింతురు. యిది పరమగురు రహస్యము, గురువు ఉపదేశమునగాని శిద్ధింపదు. అట్లు గనుక నీకు ఉపదేశమిచ్చితిమి. అంతట సంతోషమున మరిన్నీ నమస్కారములు గావించి లేచి, వీరగురులే మీ దివ్యమంత్రంబున కృతార్థుఁడనైతిని. ఈ మంత్రమునకు పూజ నమస్కారములు యవరు జేయుచున్నారో వారు ఆయురారోగ్యము, ఐశ్వర్యమున వర్ధిల్లుదురు.

    శ్రీ మద్రాజాదిరాజ పరమరాజేశ్వర రాజచూడామణి, పంచరాజ, బహురాజ, పరమరాజ రాజోత్తమా చరాచర నారాయణనామ ఆత్రేయస గోత్ర పవిత్ర సోమవంశోద్భవ కేతనా నామకులయిన వెంకట నామపుత్ర జగన్నాధు గర్భ రత్నాకర కనిగిరి నివాసులయిన ఆంగీరసనామ సంవత్సర చైత్ర శు౯ (9) లు గురి, గురి, గురి, నాగురి, ముదుగురి, బాలగురి యీ భూదేవి ఆకాశవాణి అమరసోమ యీ జగన్నాధు, యీ జగత్రయమెల్లా యీ కొమారుని కీర్తిస్తి మనస్సులో శంకలరంగా వర్ణబ్రహ్మముమీద జగదేశనాధా, సర్వేశా, చక్రధర్మాత్మా, సర్వేశా రాజేంద్రుని రంగని మహిమ లక్ష్మీకళత్ర కారుణ్యముమీద దినదినము కనుపిస్తిమి. మహిమాత్మము శ్రీ రంగ జయ కుమార శ్రీ వీరాత్మ జయ జయ ధర్మజపుత్ర జయజయ కస్తూరి శ్రీ రంగా మానవనాధ వెంకటేశా జయజయ చంద్రసూర్యకాంతులుగా రంగరాజనే వార్త పట్టాభిషేకంబు పరమ పున్నమమీద రంగనిమహిమ తెలియంగలేరు. ధర్మజుని పుట్టుబడి యెరుగలేరు. తెలియరాదు కారణమెవ్వరు కానంగలేరు. తూర్పున గురు మకరమందు శీఘ్రశీఘ్రముమీద పుత్రునికి శీఘ్రశీఘ్ర శుభమస్తు ఐశ్వర్యమస్తు ఆయురారోగ్యమస్తు బ్రహ్మాండమేదో అనంతమస్తు కావేటి రంగప్పడు కట్టడి చేసును ఆ మీదట వార్తలు దిక్కుదిక్కులవచ్చును. కొమారు వీరధర్మజ హస్తమహిమ జీర్ణదేహంబులు హేమవర్ణంబులు దివ్యదేహము నిచ్చెద. సర్వ సంభ్రమమిచ్చె వాకుడాకులతో వన్నెయిచ్చె చామరాంధోళికా చక్రాంకితము మీద యే వేదమునైన యెత్తిచదువ నాకొమారర్మమనే వివరము. పాపాలన్ని పరిహారము పకపక నవ్వీని, పాలుట్ల రంగనాయకులు పసిబాలురతో మాట్లాడిపోయ్యీని శ్రీరామా నిన్ను నేను రంగని వద్దకు ఠీవుగా రమ్మంటిని. అయ్యయో రావద్దంటినా నీకు అది భాగ్యముగాదని అంటిని. రంగేశురంగని మహిమ రాజ్యములవారు నన్నే కొలచెదరు. అన్నినామములు నాకొమారునకె యిస్తిని. నేను వుత్తరమునుంచి వుద్భవించి పండ్రెండుయేండ్లు అజ్ఞాత వాసంబుజేసి ఆ మీదట సధోపవాసమున చాలా శ్రుక్కి, జీర్ణదేహముమీద మరుగుకొండలు మూడున్నూదాటి సూర్యమండలానకు వచ్చి సూర్యమండల వృషభ, నందీశ్వరునిమీద శ్రీరాములు వస్తూయున్నాడు. నేను భాగవతము వెంటనే తెస్తూవున్నాను. నేను కావేటి రంగప్ప మహిమచే దరిద్రనాశము చేసేటప్పుడు కావేటి రంగప్ప మహిమచే సకుటుంబము పదకొండోనాటి అవతారఁబుమీద కావేటిలో ఓ రంగ జయదేవా ఓం బీజదేవ, ఓం బ్రహ్మచరితా, ఓ రాజరాజాత్రా, ఓ రంగనాధాత్మా, ఓం రాజధర్మాత్మా, ఆది వెంకటపుత్రా, ఆది సూర్య సమన్వితా లోకానికెల్లా సూర్యుడు వక్కడే మా కొమారుడు లోకమెల్లా యేలేవాడు, వక్కడే అనే అర్థము. కావేటి రంగని మహిమ కైలాసంనుంచి యిరువై నాలుగుయేండ్లు యుండి తిరిగి, యిరువై అయిదోయేట మా వద్దకి వచ్చీని, సన్యాసివేషంబు సంతోషంబుల మీదట సాక్షాత్తు రామధర్మజమూర్తి వుద్భవము సర్వాత్మ సర్వే, సర్వనాటకధారి సదోపవాసంబు విడిపించి భోంచేయ కట్టడిచేస్తిమి. తెల్లకోకలు, తిరుమణి తిరుచూర్ణముతో చానాకట్టడి జేసితిమి అప్పుడు నామహిమ కనిపిస్తూ యున్నారము. ఆలోజన్మ ప్రకృతి షణ్మతంబులకు భేదములేని పలుకు పలికే విరాట్ అతడే నేను, నేనే తాను తానే నేను, వెంకటనాధున్ని ఆడి పాడేరు. వీరభోగి కుమారుండని అందరు ఆడి పాడేరు. మాయవేష నరసాంగత్యములు పదులు రెండు, పంచకాలు రెండు విూద ప్రకాశార్థం గీతా నా భక్తులే శేష్టులు. బ్రహ్మచారి ఆశ్రమమే శాశ్వితం. యిది ఆప్రమేయం చేసినవారు దురితాకుడుల్లినట్లు డుల్లుదురు. నా మహిమ యెరుగని ద్రోహిముండలెల్లా చీమలు పుట్టలు మడచినట్లు మడుతురు. కా-యా-రా నావచనంబులబోదురు. నా స్వరణ చేసిన మానవులు నా భక్తులే శ్రేష్టమని వినాయకుడు, శివుడు మెచ్చీని, రాచకులంబులో బుట్టీని ఆ తీరు మునులెల్లా హరికి అరచేతి కంకణం అమరగట్టితిమి. నళ పింగళ యిది నాతో యిష్టముజేసి యుండెను. గనుక అంగీరస సం॥రమే గురి గురినగురి, ముదునగరి, బాలగురి ప్రజోత్పత్తినామ సంవత్సర బ్రహ్మ బ్రహ్మముమీద సోమసూర్యాజ్ఞులు రాజాత్మా రంగేశుని పాదమాన త్రిభువనంబులెల్లా రంగేశం జయజయ ధ్వనులచేత సిద్ధాంతమెల్లా గనబడ దెల్పితిమి. అచ్యుత అనంతరంగ దూర్తులమీద శ్రీరంగ రాజాన్మత్వము శ్రీ రంగదేవా, శ్రీ రంగనాదేశా రంగణి పాదమే సాక్షి వ్రాసినదంతా తధ్యం బాపు వెంకటనాధు వెంకృతార్థు పూజ వేడ్కతోను ఆ మీద నాపేరు ఆది కేశవుడంటిని దేవదేవోత్తరంగా పంచశక్తుల తోను భూమండలము సాధ్యంకరిష్యే తూర్పునాటికి బోయిరా అంటి గూడూరు గురిజాల సంధు సింధునదిదాటి రాగా దాస సింగులు వచ్చి పరస మాటలాడినందువలన అయ్యోవారు కానుగారు, కానివారు పోనుబోరు అది యెరిగి శిరసా వహించి గురిచూచిన తారభ్యం గుమ్మటము, యేశిన తారభ్యం, కాశేకాయలు కాయవు అది యెరిగి అది అంటిన పనిగాదని తెలియకుండా మెమైతే సూహృచ్చాదనచాయ వస్తూ యున్నాము. మీరు అందుకు సంశయము పడవద్దు, ఆ ప్రకారం వారికిని నిర్వంశము చేస్తాము. పూజా ఆరము కొంత పుక్కలించి ఆమీదట వుద్భవమని చెప్పితిమి అదినిశ్చయము అబద్దమొ అని నేనే అనుకొంటిని ఫలసౌఙ్ఞ కాబోలు లేకుంటే యీ కాయవేటిని యిది వుద్భవం గురి లేకుంటే యీ సౌజ్ఞ లేటివి.