శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర


  • జ్ఞానానుభవము గలిగిన సిద్దయ్యకు ఒకనాడు శరీరములో షట్చక్ర ఆధార వివరములు భోధించు చుండెను. అదే గ్రామ మాదిగ కక్కయ్య పరోక్షముగా నుండి గురుశిష్యుల వాదము వినుచు, ఆహా! దేవుళ్లను దర్శించు మార్గము ఎంత సులభముగా నున్నది ఇన్నాళ్ల నుండి తెలిసికొనలేక పోయితిని, ఈ గురువు చెప్పినట్లే చేసి చూచెద కానీ ఎవరిని పరీక్షించవలె, ఎవరినేమి అడిగేది. ఇంటికి వెళ్లి నా భార్యముత్తినే పరీక్షించెదనని బిర బిర ఇంటికి వెళ్లి, ఇల్లాలిని కత్తితో నరికి శరీరమంతా చిందర వందరగా కోసి చూడగా, ఎక్కడ ఏ దేవుడు కనుపించలేదు. ఉగ్రుడై చేతిలో నున్న కత్తిని పారవైచి దుఃఖించుచు పరుగు పరుగున వీరబ్రహ్మేంద్రస్వామి దగ్గరకు వచ్చి ఓ స్వామీ! మీరు పేరు ప్రతిష్ఠలు గల పెద్ద గురువులు మీరు తురుక సిద్దయ్యకు భోదించుచున్న మాటలు విని నిజమని నమ్మి, ఇంటికి వెళ్లి నా ఇల్లాలిని కత్తితో కోసి చూడగ ఎక్కడ ఏ దేవుడు కనుపించలేదు. కాని నా ఇల్లాలిలో యున్న జీవుడు మాత్రము ఎగిరిపోయినాడని చెప్పగా! విని వీరబ్రహ్మేంద్రస్వామి కక్కని శిరస్సును తన సవ్యహస్తముచే నిమురుచు కక్కా! దుఃఖించకు నీ ఇంటికి పోదాము పదా అక్కడనే అన్ని చూయించి నీ సంశయము తీరుస్తానని చెప్పి సిద్దయ్యను తోడుకొని కక్కని ఇంటికి వచ్చి చిందర వందముగా కోసిన ముత్తిని జూచి కక్కనికి ముత్తి శరీరములో మూలాధారము నుండి సహస్రారము వరకున్న దేవతలను వరుసగా చూయించి ముత్తిని బ్రతికించెను.

    కక్కడు అతని భార్య ముత్తి ఇద్దరు స్వామివారి పాదములపై బడగా! ఆ స్వామి కక్కనికి మంత్రోపదేశము చేసి, శాంభవీ దీక్ష ఇచ్చెను. శాంభవీ దీక్ష అనగా ! ఇది విచిత్రమైనది అద్భుతమైనది, శక్తివంతమైనది, ఇది ఆకస్మికముగా ప్రాప్తించును. కఠినుడైన, క్రూరుడైనను, నాస్తికుడైన అతనిలో పవిత్రత మూర్తీభవించును.

    ఎటులనగా! క్రూరుడుగాని కఠినాత్ముడుగాని గురువునకు ఆకస్మికముగా తటస్థించిన వానిలో యుండె ఆగ్రహము, ఆవేదన దెలిసికొని వానిని తదేక దృష్ఠిచే చూచుచు వాని శిరముపై హస్తముంచిన వానిలో యుండె దుర్గుణములన్నీ హఠాత్తుగా మారిపోయి పవిత్రత చేకూడి తనలో జ్యోతి ప్రకాశించును. అపుడు అంత తెలిసికొనును.

    కం॥ ఈవలి కథగ్రహింపుడు

    గోవిందార్యునకు గలిగె గోరికలలరన్

    కేవలము జ్ఞానశక్తియే

    భూవలయమునందు వారి - ఋత్రిక యగుచున్ ప్ర. నిష్ప్ర

    గోవిందయ్య గిరిరాజమ్మ దంపతులకు క్రీ॥శ॥ 1683 రుధిరోద్గారినామ సం॥ర ఆశ్వీజ శుక్ల పక్ష సప్తమి రోజు జ్ఞానశక్తి వారిపుత్రికగా జన్మించె వీరబ్రహ్మేంద్రస్వామి ఆ బాలిక ముఖము చూచి మహాయోగిని కాగలదని తన తల్లిపేరే “ఈశ్వరమ్మ” అని నామకరణము జేసెను. ఆ బాలిక దినదినాభివృద్ధి చెందుచు పంచవర్ష ప్రాయురాలు ఆయెను. ఆ బాలిక జేజనాన్న వీరబ్రహ్మేంద్రస్వామిని జేజమ్మ గోవిందమాంబను అప్పుడప్పుడు గురుగోప్యమైన గూడార్థముల గూర్చి ప్రశ్నించుచు కుడి ఎడమ నడుమ ఆడేదాన్ని గురుతు జెప్పుమనుచు వారి బుద్ధికి మెప్పైన ప్రసిద్ధమైన ప్రశ్నలను అడుగుచు కాలము గడుపుచుండెను.

    ఇంతలో నాగుల చవితి పండుగ వచ్చెను. గిరిరాజమ్మ ఆనాడు ఊరి వెలుపలనున్న పుట్టలో పాలుపోయడానికి వెళ్ళుచుండగా ఈశ్వరమ్మ తన తల్లి వెంట వెళ్లెను, పుట్ట దగ్గర చాలామంది వున్నందున గిరిరాజమ్మ ఒక చెట్టు క్రింద నిలుచుండెను. అంతలో పుట్టలోపలి నుండి సర్పము బయటికి రాగా అచట నున్న వాండ్లు భయపడి పారిపోవుచుండిరి. ఈశ్వరమ్మ ఆ పుట్ట దగ్గరికి వెళ్లి యహిరాజా! నిన్ను పూజింప వచ్చిన వారినేల భయపెట్టుచున్నావని అనుచున్నంతలో ఆ సర్పరాజము వచ్చి ఈశ్వరమ్మ మెడలో హారమువలె పడి తోకముడివైచి పడగ విప్పి ఆడుచుండెను.

    ఆ వార్త వీరబ్రహ్మేంద్రస్వామికి తెలిసి సిద్దయ్యను తోలించెను. సిద్దయ్య అక్కడికి వెళ్లి ఆ బాలిక నెత్తుకొని గురువుగారి ముందుంచెను. ఆ స్వామి ఆమె మెడలో పామును జూచి అమ్మా! ఈశ్వరీ! నీవు చిన్నదానవు ఇప్పుడే పాములతో చెలగాటం ఆడచున్నావా! అనగా! జేజనాన్నగారూ! మీరు రవ్వలకొండ గుహలో సర్పములను ఎన్నింటినో ఆభరణాలుగా ధరించి అన్నాజన్నయ్యకు, అచ్చమ్మకు దర్శనం ఇచ్చితిరి గదా! నేను మీ పౌత్రినైయుండి ఒక పామును కంఠాహారముగా వేసికొనుట నాకు అర్హత లేదంటారా! అనగా,

    వీరబ్రహ్మేంద్రస్వామి ఆమె బాలవాక్యములు విని ఆమెకు మంత్రోపదేశము చేసి "శక్తి దీక్ష"ను ఇచ్చి, అమ్మా! పౌత్రీ! పాముకు పాలు త్రాగించి యధా స్థానమునకు పంపించుము అనగా ఆమె అటులనే పాలు త్రాగించి పంపించెను. ఒకనాడు ఆ స్వామి అష్టసిద్ధులు బొందిన అయిదవ కుమారుడు దక్షణామూర్తిని పిలిపించి నాయనా! కుమారా! ఈలోకములో అధర్మము ప్రబలుచున్నది. దుష్ఠులు, దుర్మార్గులు ఘనులై యుండుట వలన ధర్మదేవతకు స్థానము లేకుండ పోవుచున్నది. కావున నీవు దేశము నలుదిశలు సంచరించుచు కాలజ్ఞానములోని భవిష్యద్వాక్యములు ప్రజలకు అర్థమగునట్లుగా భోదించుము. అది భౌతిక ఆది దైవికములు నిన్నంటవు. కీ॥శ॥ 1688 విభవనామ సం||ర చైత్ర మాస శుక్ల పక్ష విదియలు గురువారము బ్రహ్మ ముహూర్తము * నీ ప్రయాణ ముహూర్తము తదుపరి శివరామ బ్రహ్మవై జన్మించుమని ఆశీర్వదించి పంపించెను. తండ్రిగారి ఆజ్ఞానుసారము దక్షణామూర్తి దేశసంచారము వెళ్లెను. * చూడుడు ప్రపంచ నిష్ప్రపంచాను భవ కందార్థ సంగ్రహ పేజీ 338

    శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఒకనాడు గ్రామపెద్దలైన శేషారెడ్డి, కుచ్చుబాబు, సుబ్రహ్మణ్యులను పిలిపించుకొని గ్రామ పెద్దలారా! నేను ముందు సజీవసమాధి అగుటకు ఊరికి ఉత్తరదిశలో వున్న స్థలములో భూమంఠపము కట్టించవలెను. దానికయ్యే ఖర్చు ఆ దేవుడే ఇవ్వగలడని చెప్పగా!

    ఓ స్వామీ! మీ ఆజ్ఞ శిరసావహించెదమని ఆ స్వామిచేత మంఠపము యొక్క ప్లాను శంకుస్థాపన ముహూర్తము వ్రాయించుకొని తీసికొని వెళ్లి సుముహూర్తమున శంకుస్థాపన చేయడానికి గర్తము త్రవ్వుచుండగా దానిలో బంగారునాణెములు గల భరణి కనుపించెను ఆ వార్తా స్వామికి తెలుపగా