
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వంశచరిత్ర
-
స్వామీ! మీ ఆజ్ఞను శిరసా వహించెదను. కాని నాకు ఒక చిన్న కోరిక ఏమనగా! మీరు వ్రాసిన కాలజ్ఞాన గ్రంథాలు భూమంటపము నుండి ఎపుడు బయటికి వచ్చునో తెలుపగలరని కోరు చున్నాను. అనగా
* చూడుడు శ్రీ మౌనేశ్వర మహాత్మ్య సహిత గురుపుష్య యోగ వ్రతము పేజీ 99
కం॥ కార్తీకశుద్ధ పూర్ణిమ
పూర్తిగ ఎనుబదేండ్లకు పూర్వాహణమునన్
గర్తగృహమున కేగుట
గుర్తుగ పైమూతదీసికొని రావలయున్ ప్ర. నిష్ప్ర
అని శిష్యునకు సమాధానము చెప్పెను, అచ్చమ్మ, అన్నాజయ్య ఇద్దరు స్వామికి పాదపూజచేసి పట్టుపీతాంబరములతో అలంకరించి మంగళ వాద్యములతో వీడ్కోలు చెప్పిరి.
వీరబ్రహ్మేంద్రుడు అల్లాడుపల్లెకు వచ్చి తల్లిదండ్రులకు పాదనమస్కారములు చేసి తాను వ్రాసిన కాలజ్ఞాన గ్రంధముల వివరములు తెలియజెప్పి ఇంత వరకు నా బ్రహ్మచర్య వ్రతము పూర్తి అయినదని చెప్పగా, తండ్రి సంతసించి శ్రీఘ్రమే వివాహప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను.
గురువయ్యాచార్యుడు తన బాల్యమిత్రుడైన అహభూనబ్రహ్మర్షి గోత్రజుడైన కమలాపురం కనకాచార్యులనాహ్వానించి తన కుమారుని వివాహమునకు తగిన సంబందం గూర్చి అడుగగా! విని *కనకాచార్యుడును నుసుమ గ్రామము వెళ్లి సుపర్ణ బ్రహ్మర్షి గోత్రజుడైన భ్రమరాంబాచార్య లక్ష్మిదేవమ్మ దంపుతులను విచారించగా వారు విని, * చూడుడు ప్రపంచ నిష్ప్రపంచకందార్థ సంగ్రహము పేజీ 198 ఆచార్యా ! వీరబ్రహ్మేంద్రుని వివరములు చిన్ననాటి నుండి మాకు తెలిసినదే, కానీ మా కూతురు గోవిందమ్మ * పార్వతీదేవి అంశలో జన్మించినదని మీకు తెలిసినదేకదా! మా అమ్మాయిని అట్టి వరునకిచ్చుట తగునా? భ్రమరాంబాచార్యా! వీరబ్రహ్మేంద్రుడు సాక్షాత్పరమేశ్వరుడే వీరి తొలి అవతారము బాల్యములో
కంII ** ఐదేండ్ల బాలుడయ్యును
నైదక్షరముల భావము - నమరిన చోటన్
ఏదో తెల్పుడటంచున్
వాదించెనటండ్రుగురున-వశ్యుడుగాగన్ ప్ర. నిష్ప్ర
కనకాచార్యుడు గురువయ్యాచార్యుని భ్రమరాంబాచార్యులను ఇద్దరిని కలిపి సుముహూర్తము నిర్ణయించి నుసుమ గ్రామమలో వీరబ్రహ్మేంద్రునికి గోవిందమ్మకు కనకాచార్యులే పురోహితుడై వేదొక్తముగా వివాహము జరిపించెను.
నూతన దంపతులిద్దరు అల్లాడుపల్లెకు వచ్చిరి. గోవిందమ్మ అత్తగారి ఆజ్ఞను పాటించుచు అత్తగారికి సేవజేయుచుండెను. వీరబ్రహ్మేంద్రుడు తండ్రిగారి ఆజ్ఞానుసారము నడుచుచుండెను. * చూడుడు ప్రపంచ నిష్ప్రపంచ కందార్థ సంగ్రహము పేజీ 198
* చూడుడు శ్రీ మౌనేశ్వర మహాత్మ్య సహిత గురుపుష్యయోగ వ్రతము పేజీ 27
కొంతకాలమునకు ఈశ్వరాంబ జీవైక్యమొందెను. తదుపరి గురువయ్యాచార్యుడు అచటి భాద్యతలన్నీ కుమారుని అప్పజెప్పి తాను సన్యాసాశ్రమము అవలంభించి, పాదయాత్రచే దేశసంచారము చేయుచు ప్రకాశం జిల్లాలో గల పామూరు సమీప * అనుమునిగిరి కొండ గుహలోపల తపస్సు చేయుచు మకర సంక్రాంతికి గుహలో జీవైక్యమొందెను.
బనగానిపల్లెలో అన్నాజయ్య స్థూలదేహము విడిచి కలగోట్ల పురములో దూదేకుల పీరు సాహెబు ఆదంబీ దంపతులకు పుత్రునిగా జన్మించెను. తల్లిదండ్రులు ఆ బాలునికి సిద్దీకు అని నామకరణము జేసిరి. సిద్దీకు పెరిగి పెద్ద వాడాయెను. ఒకనాటి రాత్రి వీరబ్రహ్మేంద్రుడు సిద్దీకునకు స్వప్న దర్శనమిచ్చి తనయొక్క తొలిజన్మవృత్తాంతము తెలియజేసి నేను అల్లాడుపల్లెలో యున్నాను. రమ్మని చెప్పి అదృశ్యుడాయెను.
సిద్దీకునకు మెలుకువ కలిగి స్వప్నవృత్తాంతము జ్ఞప్తికి తెచ్చుకొని ఉదయమే ప్రయాణమై అల్లాడుపల్లెకు వచ్చి వీరబ్రహ్మేంద్రుని దర్శించి,
కం|| ప్రత్యక్షము మీరూపము
ప్రత్యక్షముగాను మీరు పలికినయటులన్
ప్రత్యక్షము కలగంటిని
ప్రత్యక్షము జాగ్రతండ్రు – పదపడిగంటిన్ ప్ర. నిష్ప్ర
* గురువయ్యాచార్యుడు జీవైక్యమొందిన గుహయందు ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి, శివరాత్రికి రెండుసార్లు ఘనముగా ఉత్సవములు జరుపుచున్నారు. నేటికి దర్శించవచ్చు.

