శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర

అపుడాతడు స్వాములారా? స్వాములవారు వెళ్ళుటకు నేను తొలగవలసిన పని యేమున్నది. వారటు వెళ్ళుదురు. నేనిటు బోయెద. ఇందుకేల సందేహ? మనెను.

అందులకా భూ దేవతలు ఓయీ నీవుకడజాతి వాడవు.స్వాములవారా బ్రాహ్మణులు. అందుననూ యతీశ్వరులు. వారినంటుచూ కొలది ప్రదేశములో నీ వెటుల వెళ్ళగలవోయి? అనిరి.

అదివినిచండాలుడు ఓ ఉత్తమోత్తములారా తొలగ వలసిన దేది? దేహమా ? జీవమా ? దేహము తొలగినచోజీవునకు స్థానమే లేదుకదా?జీవుడే తొలగుచో దేహము చలింపదు. (నడువదు) కదా ? ఇందేది తొలగ వలసియున్నదో మీ శంకరులను నిశ్చయింపమనుడి? అని నుడువగనే, శ్రీశంకరుడాతనిప్రశ్ననందుకొని వివిధ వ్యాఖ్యానముగల శాస్త్రసూత్రములను పలుకగా, అన్నిటకు నాతడు సరియైన సమాధానముల నిచ్చుచునే యుండెను. వానిని వినిన శంకరుడు ఈతడు చండాలుడుకాడు సాటెత్ శ్రీ విశ్వనాథుడేనని నిశ్చయించుకొని అతని పాదములకు మొక్కుచు

"చండాలోస్తు సుతద్విజోస్తు గురురి త్యేషా మనీషా మమ” అనుచూ

విశ్వనాథుని బహువిధముల సన్నుతించెను. అపుడా కాశీనాథుడు ప్రత్యక్షమై శంకరా ? అభ్యాసమునందు కూడ కలదో లేదోయని చూచుటకై యేతెంచితినేగాని, వేరొకటికాదు. నీ యంతరంగము పరబ్రహ్మ పరిపూర్ణ మైనదని తెలిసికొంటిని అనుచూ అంతర్హితుడాయెను.

అలాగుననే నేటి మన శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు ఈ విషయములో కూడ ఆధ్యాత్మ విచారణా ప్రసంగము బోధనమువరకేనా లేక అనుభవ సిద్ధమో తెలియుటకీ కక్కనిద్వారా యీతని సచ్చారిత్రము పవిత్రమగు అంతరాత్మ, భక్త వాత్సల్యత అవగతమగుటకై ఈ పరిణామము వచ్చినది.

కక్కనికేమి బోధ? అనుచుండిరి ఒక వైపున శిష్యవర్గము, ప్రజలు కూడ. ఏకలవ్యునివలె యీతడు బ్రహ్మము గారికి సిద్ధుని కంటెను ముఖ్యమైన శిష్యత్వము నేర్పరచుకొని ప్రాణము పణముగబెట్టి బ్రహ్మముగారి గురుత్వమును లోకము నకు చాటుట బహు విచిత్రముకదా?

ఎవ్వరేమనిననూ ప్రస్తుత స్థితిలో కక్కని రక్షించి కృతార్థుని చేయవలెనేగాని ఉపేక్షించినచోనిక నేమైనయుండునా ?

బ్రహ్మముగారు కక్కని గృహమునకు వెడలుట

శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఎవరి మాటల నెంతేని లక్ష్యము చేయలేదు. ఆతడే జాతి వాడైననూ అతని ఆధ్యాత్మవిద్య పరిపక్వదశకు వచ్చినది కనుకనే ఇంతపని జరిగినది. లోకమున ఇట్టిపరీక్ష నెవరేని జేసి యుండిరా ? అని తలపోయుచు ఓయి శిష్యా ? భయపడకుము. చెడిన దేమియును లేదు. ఇదిగో ఇపుడే నీ వెంటవచ్చు చున్నాను. నీవు వినిన ఆధ్యాత్మిక తత్వమంతయును నిశ్చయమైనదే ! ఇందా వంత మోసము లేదు. నేను నీవనుకొని నటుల బూటకపు గరువును కాదు.

మనమిక ఒక క్షణమైన నాలస్యము చేయవలదు. అని హెచ్చరించుచు కక్కని గృహమునకు వెడలి, సిద్దా ! చూచి తివా ఈతడు చేసిన ఘోరకృత్యము. కనులు మూసికొని అంతర్ దృష్ట్యా ఆధారాదులను నిరీక్షించవోయి ? అనిన వాక్యమును ప్రత్యక్షముగ జూచుట కింతపని చేసినాడు. అనుచు

షట్చక్రముల వివరించి చూపించుట

ఓయీ కక్కా! ఇటురమ్ము. ఇదిగో చూచితివా

1. మూలాధారము. ఇదిగో ఇవియే పద్మమునందలి చతుర్దళములు. వీనియందివియే అక్షరంబులను భావనాశుద్ధితో దర్శించవలెను.ఇతడు గణపతి. ఇదియొక చక్రము.

2. ఇదియే స్వాధిష్ఠానము. ఇంచారు దళంబులు, వీనిమధ్యయున్న బ్రహ్మఇదిగో చూడుము.

3. ఇది మణిపూరకచకము. ఇందలి దశదళంబు లివియె, ఇందుండు విష్ణువితడే, చూచితివా విష్ణు తేజస్సునుచక్కగ పరికింపుము.

4. ఇది అనాహతము. ఇందు పండ్రెండు చక్రములమధ్య రుద్రుడు వెలుగొందుచున్నాడు.

5. ఇది విశుద్ధచక్ర మిచటి పదియారు దళంబుల మధ్య జీవుడు దీపశిఖవలె వెలుగొందుచున్నాడు.

6. ద్విదశంబులుగల ఆజ్ఞాచక్రంబిదియె, సూర్యచంద్రా భిన్నంబగు పరమాత్ముని తేజం బిచట దర్శనమిచ్చుచున్నది.

7. ఇది సహస్రారము. ఇట వేయి దళంబులమధ్య కోటి సూర్యప్రకాశమానుండైన శ్రీ సద్గురు మూర్తి గోచరించుచుండెను గదా ?

ఇటుల సద్గురుమూర్తి తాను స్వయముగ చక్రములను తదధిపతులను చూపింపగనే తన్మయత్వమునందు మునిగిన కక్కయ్య సిద్దయ్యయు బ్రహ్మానంద భరితులైరి. ఒడ లెరుంగని మహదానందాంబుధి నోలలాడిరి. కొంతసేపటికి ఉన్మీలిత నేత్రులై సత్ గురుకటాక్షమున నేడు మా జన్మంబులు తరించినవి. ఇట్టి మహానుభావులేగదా ? నిజమైన గురూత్తములు.

  • eshwari devi mattam
    kalagnani qr code