శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడైన కక్కయ్య స్వామి జీవిత చరిత్ర


శ్రీ బ్రహ్మముగారి వేదాంతంలో కులమత తత్వాలు

నేటికి సుమారు నాలుగువందల సంవత్సరముల పైబడిన కాలంలో మన ఆంధ్రదేశంలో ఆవిర్భవించినాడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు. ఆయన ఆదివిశ్వబ్రాహ్మణవంశంలో శైవ సాంప్రదాయ నిష్టాపరుడై జన్మించినను శ్రీమదద్వైత సిద్ధాంతాన్ని విశిష్య ప్రచారం చేయుచూ బ్రహ్మతత్వాన్ని నిర్దుష్టంగా ఆశ్రయించి, అందుగల సమగ్రతను గమనించి తత్ప్రాధాన్యతను తాననుభవించుచు, వేవేల జనంబులకుకూడ ఉపదేశంబులునిచ్చుచుతన యావజ్జీవితమును బ్రహ్మకైంకర్య మొనరించి జీవసమాధి నొంది యావదాంధ్ర దేశమునకేగాక భూమండల మందంతటిలో తన పేరు ప్రతిష్ఠలు ఆచంద్రార్కస్థాయిలో నుండునటుల కీర్తిని గడించినాడు.

తాను రచించిన కాలజ్ఞాన గ్రంథంలో తానవతారమూర్తిననుచూ తన సర్వజ్ఞత్వాన్ని విపులంగా ప్రకటించినాడు. ప్రాచీన భారతీయ నాగరికతా కాలములో సంస్కృతము ప్రధానభాష, దేశీయ భాషలలో అగ్రతను పొందినది తెలుగుభాష యావద్భారతంలో వేదములకు, శాస్త్రములకు, రామాయణ భారతాది గ్రంథములకు బహుజన ప్రాశస్త్యముకలదు. హిందూమత మీ గ్రంథముల సారమనియే చెప్పవచ్చును. పూర్వజన్మ కర్మఫలితములను జీవుడనుభవించుచుండును. సద సత్కర్మల ఫలమూలముగనే పునర్జన్మము చేకూరుననెడిది హిందూమత నమ్మకము. చాతుర్వర్ణముల విభాగము ఆచరణీయమై యుండెడిది. ఆ సమయమున విదేశీ దండయాత్రలు కారణముగను తురుష్కులు అన్యోన్యము రాజ్యకాంక్షలకు లోనై దేశమునగల ఆలయ శిల్పాదికములను చిన్నాభిన్నం చేయడం ప్రారంభించారు. దీనిమూలకంగా హిందూమతస్థులుకూడా కొందకు ఇస్లాం మతాన్ని చేపట్టినారు. కొందరు క్రిష్టియన్ మతంలో ప్రవేశించినారు. ఈ పరిస్థితులలో జైన బౌద్ధమతాలు ఆవిర్భవించి అద్వైతమతాన్ని మూలకు నెట్టవలెనని యత్నించినవిగాని, దీని ప్రాబల్యం సుదృఢంగా వుంది, అన్నిమతాలను ఆదరణతో చూస్తూ యేమతమునందు ద్వేష భావము లేకుండుటయే ఇది అడుగంటకుండుటకు ముఖ్య కారణము. ఇతర మతములలో ఇంతటి సహనశక్తి లేదనుట నిర్వివాదాంశం.

కాలం ఒకే విధముగా ఉండదని కాలజ్ఞానము తెలిసిన వారందరకు తెలుసు సాధారణ ప్రజలు ఒకేరకంగా నడుస్తుందని భావించటం కూడ కద్దు. వ్యావహారికులు ఏ కాలానికాగొడుగు బట్టి తమ కార్యార్థాలు సిద్ధింపజేసికొని తృప్తి పడతారు. కాని ప్రాజ్ఞులైన జ్ఞానులు తమను మరచి లోకాన్ని ఉద్ధరించే విషయంలో కంకణం కట్టుకొని నడుం బిగిస్తారు. ఆ కోవకు చెందినవాడే శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మముగారు.

దేశంలో నలుమూలలా దౌష్ట్యం ఎక్కువైంది.ఆచారాలు, వ్యవస్థలు పెచ్చు పెరిగి దుర్మార్గానికి దోహదాలవుతున్నాయి. వైదిక దైవిక సాంప్రదాయాలను అణగ దొక్కుతూ బౌద్ధమతం పెల్లుబికిన ప్రవాహంలాగా బయలు దేరి కట్టలు తెగిన నదీ ప్రవాహంలాగా లోకాన్ని భ్రష్టం చేస్తున్న ఈ మతంలో కూడ రెండు చీలికలు యేర్పడినవి. హీనయాన, మహాయాన అని. హీనయాన కృత్యములు ప్రజలకే యేవగింపయినందున కొలది కాలములోనే దాని ప్రభావము క్షీణించినది. మహాయాన సాంప్రదాయంలో విగ్రహారాధనకు ప్రాధాన్యత పూర్తిగా యున్నందున శిల్పకళా వైశిష్ట్యం ఆ రోజులలో పుంజుకొన్నట్లు మరెన్నడును వృద్ధి కాలేదు. నాటి రాజశేఖరులందరు మహాయాన మార్గస్థులై ప్రజలను ప్రోత్సహించి ఆలయ పోషణము శిల్ప చాతుర్య వైలక్షణంగల కళా ప్రపూర్ణులను విశేషంగా ఆదుకొని పోషించి కశాఖండాలను సుస్థిరం చేసినారు.

ప్రతిభా భాషితుడైన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు జాతీయమైన శిల్పకళా వైశిష్ట్యాన్ని దేశదేశాలు తిరిగి ఎచ్చటెచ్చట యేయే వైభవాలున్నవో చూచి ఆనందించటమేకాక, ఆయా స్థానములలో యుండదగిన కొన్ని పవిత్రమైన విశేషాంశములను తెలియ పరచుచూ శిష్యులకు బోధలు జరుపుతూ తాను వాటి రూపురేఖలనూదిద్ది చూపుచూ దేశ ప్రచారాన్ని సాగించాడు.


కక్కడు

ఇంతవరకు శ్రీవిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి చరిత్రలో ముస్లిములకు హిందువులకుగల మత భేదము ఎంచదగినది కాదు.అందరును భగవంతుడొకడే,ఎవరేవిధముగ భగవంతునాశ్రయింతురో వారావిధముగ భగవత్సాన్నిధ్యము నొందగలరు. దేవునకు మనుష్యునియందు విభిన్న భావము లేదు. మనుష్యుడు దేవతను భిన్న, భిన్నాభిప్రాయముల చూచిననూ, కొలిచిననూ, అన్ని దేవతల శక్తి అంతయు ఒకేరూపమైనది కనుక భక్తులు పొందునట్టి ఫలములో విభిన్నత యుండదనెడి విషయమును తెలిసికొనియుంటిమి.

ఈ విధముగ హిందూముస్లిము సమైక్యత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి దృష్టిలో యేకీకృతమై బహుజన సామాన్యముగ జానపదములలో కూడా ప్రతిబింబించినది.


ఆధ్యాత్మ విచారణ

ఇంతటితో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారికి సిద్ధని యందు దృఢమైన శిష్యవాత్సల్యము ప్రబలిన కారణమున ఒకనాడు ఇతనికి పరిపూర్ణ ఆధ్యాత్మ విచారణ బోధను తెలుపనెంచిరి.

  • మాతా ముత్తెమ్మ సమేత శ్రీ కక్కయ్య స్వామివారు eshwari devi mattam
    kalagnani qr code