జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి సంక్షిప్త చరిత్ర


జగన్మాత శ్రీశ్రీశ్రీ ఈశ్వరీ మహాదేవి దివ్య అనుగ్రహముతో పూజ్య మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర శివకుమారస్వాములవారి ఆశీస్సులతో మరియు భక్తజన ద్రవ్య సహహకారముచే నిత్యనైమెత్తికాది పూజలు, ఆరాధన గురుపూజ మహెూత్సవములు మఠం నందు కొనసాగుచున్నవి.

వివిధ ప్రాంతాల నుంచి అశేషంగా భక్తులు విచ్చేసి శ్రీ వీరబ్రహ్మ క్షేత్రమునకు విచ్చేయుచున్న భక్త జనులు శ్రీ మాతా గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు తూర్పు దిక్కున, ప్రక్కనే నెలకొని ఉన్న జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి యోగనిష్ఠ వహించిన దివ్య సన్నిధానమగు శ్రీ ఈశ్వరిదేవి మఠమును దర్శించి భక్తి ప్రపత్తులతో పూజించి సుఖ సంపదలను పొంది, అమ్మ అనుగ్రహంతో తరించు చున్నారు.



eshwari devi mattam

జగన్మాత శ్రీ ఈశ్వరీ మహాదేవి మఠం, కందిమల్లాయపల్లె, కడప జిల్లా