
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి కాలజ్ఞానము
-
భూత భవిష్యద్వర్తమాన కాలజ్ఞానము
(శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి స్వలిఖిత తాళపత్ర గ్రంథము నకలు)
(1956వ సంవత్సరములో యేకాబత్తుని వడ్ల రంగయ్య దాసుగారు అచ్చువేయించిన గ్రంథం నుండి)
తృతీయాశ్వాసము
శ్రీ లక్ష్మీ సమేతుండై నారాయణుండొక్కరుండు శంకర, బ్రహ్మలను దలంచిన వారువచ్చి సాష్టాంగ నమస్కారంబులు గావించి, లేచి ముకుళిత హస్తులై నిలుచున్న వారిని జూచి ఓయీబ్రహ్మ, ఓయీశంకర మనము మువ్వురమున్నూ యుగయుగంబు జగంబుల నవతరించి దుష్టజన నిగ్రహమున్నూ, శిష్టజన పరిపాలనమున్నూ జేయించి నియమించుట మన కర్తవ్యంబులు గదా. అటుగనుక కృతయుగ, త్రేతాయుగ ద్వాపరయుగంబులు చనిన పిమ్మట కలియుగంబు గదా అది మహాపాపయుగంబు మనము దేవరూపంబులు ధరియింపక వేరువేరు నామధేయంబులను ధరించి, నరరూపంబులు ధరియించి పుణ్యస్థలంబుల నిలచి మనము దలంచిన వాక్యంబులు రెండు నిర్వహింపవలయును. అటుగావున ఓయీ శంకర నీవు కలియుగంబున నవతరించి ఆనంద భైరవయోగి నామంబు ధరియించి నీవు గృహప్రవేశమై కాశీపురంబున నుండుము. ఓయీ బ్రహ్మదేవా నీవు కలియుగంబున నవతరించి బ్రహ్మానందులనే నామధేయంబు వహియించి సన్యాసివేషంబున దివ్యస్థళంబున నుండు. మేమున్నూ కలియుగంబున వీరంబొట్లయ్యవారనే నామధేయంబు వహియించి హరిహర పురంబున సూర్యోపాసిపరుండనై యుండెద. ఓయీ శంకరా అష్టఐశ్వర్య పదంబునునై చతుర్విధ మోక్ష ప్రదంబునునైన, నొకానొక దివ్యమంత్రంబు నీకు వుపదేశమిచ్చెద ఆ దివ్య మంత్రంబు మనము రెండో అవతారంబున కలియుగంబున మనకున్నూ పరమ భక్తులయినవారు యొకరివల్లను కారణ గురువిశ్వాస పూర్వకంబుగాను యిహపరుండు పరబ్రహ్మస్వరూపమైన ఆది నారాయణమూర్తి వీరంభొట్లయ్య దేవుడై జనించి హరిహరపురంబున వున్నాడని తెలిసి సంతోషచితుడనై నేడు పరబ్రహ్మయైన స్వామిని గంటిని. అని కాశీస్థళము దరలిపోయి వాయువేగ, మనోవేగంబుల దరలి హరిహరబ్రహ్మపురంబుజేరి అందు సూర్యోపాసిపరుండైయున్న వీరంబొట్లయ్య దివ్యశ్రీ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారంబులు గావించి, లేచి అంజలిజేసి పరమ పురుషా, పరమాత్మా, పరాత్పర స్వరూప, పరంజ్యోతి స్వరూప, పరాపరేఖ్య, పరమపావనా, ఆశ్రిత పారిజాతా, అనంతావతార, ఆదిగోచరా, ఆనందదయా, అంభుజ నాభా, అంభుది శయనా, ఆదిమధ్యాంత రహితా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అభేజ్య అండజ వాహన వేదాంత వేద్యా వేదగోచరా, వేదస్వరూపా, పరమ గురువే నీ మహత్మ్యంబు దెలసి సుతియింప నేనెంతవాడను. చరాచర జంతు పరిపూర్ణంబైన బ్రహ్మాండంబులు పుట్టింపను, పోషింపను, రక్షింపను, సంహరింపను, నీవే కర్తవైయుండి నన్ను బ్రహ్మను వినోదంబుగ కల్పించి నియమించుట అదిమీద యా విశేషంబు పరమ గురువా నన్ను రక్షింపుమా అని భక్తిపూర్వకంబుగా స్తుతియించిన పరమానంద భరితుండనై ఓహో శంకరా నేను నీవు బ్రహ్మ మనము మువ్వురమున్ను భైరవానంద యోగి బ్రహ్మానంద జియ్యరు వీరాచార్యులనే నామధేయంబుల నవతరించి కలియుగంబును దుష్టజన నిగ్రహము, శిష్టజన పరిపాలన చేయుట కొరకొక దాని యభీష్టంబని విన్నవింతుము. అప్పుడు బ్రహ్మస్వరూపంబైన వీరంబొట్లయ్యగారు సకల లోకోపకారంబుగ తేటగా ఆనతియ్యవలెననిన అప్పుడు వీరంబొట్లయ్యగారు పరమ రహస్యంబయిన తమ దివ్యమంత్రంబు ఆనతిచ్చిన ప్రకారం
శ్లో॥ అస్య శ్రీ వీరనారాయణ మహామంత్రస్య పరబ్రహ్మ ఋషిః దైవీగాయత్రీ చందహః శ్రీ వీరనారాయణో దేవతా సం బీజం హం శక్తిః శ్రీ వీరనారాయణ ప్రసాదశిధ్వర్ద్వే చతుర్విధ ఫలమోక్ష ప్రసాద శిధ్వర్ద్వే జపే వినియోగః ప్రాణాయామ మంత్రయం కృత్వాః తదనంతరం
అంగన్యాసములు
శాం అంగుష్టాభ్యోన్నమః శీం తర్జనీభ్యోన్నమః శూం మద్యమాభ్యోన్నమః శౌం అనామికాభ్యోన్నమః శౌం కనిష్టకాభ్యోన్నమః శం కరతలకర పుర్ణాభ్యోన్నమః శాం వుదయాయనమః శం శిరసేవ్వహ శూం శిఖాయ కాట్ శైం కవచాయహుం శౌం నేత్రత్రయాయ వషట్. శం అస్త్రాయషట్ భూర్భువస్సువరోంమితిగ్భంధః
ధ్యానము
వీరం వీరభయాది తత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్టునుతం, విరించి వినుతం, వీరాధివీరం, హరింవీరేద్రం, ఘనయోగి మాననచరం వేదాంత విద్యాకృతిం, వీరాచార్య మహాభజామి సతతం శ్రీ వీరనారాయణం॥
యిది మంత్ర జపం.
ఓం నమో పరబ్రహ్మణే శ్రీ వీరనారాయణ స్వాహాః
ఇక పూజా ప్రకారంబు చెప్పెద.
ఆదివారం నియమ మందున వుపవాసముండి మధ్యాహ్న కాలంబున స్నానసంధ్యాది కృత్యంబులునుదీర్చి రక్తచందనమున సూర్యమండలము లిఖియించి ఆ జాడ మూడు వలయంబులు దీర్చి, నడిమి వలయంబున నా నామధేయంబులు ముప్పది రెండింటిలోను వీరాచార్య, వీరగురువే, వీరబ్రహ్మణే యిన్ని నామంబులువ్రాసి, ఆ మండలమధ్యను నన్ను రత్న సింహాసనస్తునిగా భావించి రక్తగంధం, రక్తఅక్షింతలు, రక్తపుష్పంబులు మా ముప్పది నామంబుల పూజింపుము. ముప్పది నామములు యేవి అంటేను

